న్యూయార్క్ లో రోడ్డెక్కిన రెస్టారెంట్

కరోనా వైరస్ మానవాళి జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెస్టారెంట్లు అన్ని కరోనా దెబ్బకు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రెస్టారెంట్లు ఓ వినూత్న ఆలోచన చేశాయి. అవుట్‍డోర్ డైనింగ్ (బహిరంగ భోజనం)ని అమలు చేశాయి. ఇది బాగా క్లిక్ అయ్యింది. దాంతో ఈ విధానాన్ని పర్మినెంట్ చేయాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక పద్దతిన ప్రవేశపెట్టిన ఈ విధానం బాగా క్లిక్ అయ్యింది. నగర వాసులు కూడా దీన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఈ పద్దతిని శాశ్వతంగా అమలు చేయాలని భావిస్తున్నం అన్నారు. ఈ నెల 30 నుంచి న్యూయార్క్ నగరంలో 25 శాతం ఆక్యుపెన్సీ పరిమితితో ఇండోర్ రెస్టారెంట్లు తెరుకోనున్న నేపథ్యంలో మేయర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.