సెప్టెంబర్ 9 నుంచి తిరిగి తెరుచుకోనున్న N.Y.C లోని మాల్స్ మరియు క్యాసినోలు: గవర్నర్

న్యూయార్క్ రాష్ట్ర లో కోవిడ్-19 వైరస్ సోకడం ప్రారంభం అయినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మందికి పైగా ప్రజల కోవిడ్-19 సోకడంతో ప్రాణాలు కోల్పోగా, గత కొన్ని వారాలుగా న్యూయార్క్ లో కోవిడ్-19 తగ్గుముఖం పడుతున్న క్రమంలో, రాష్ట్రంలో కొంత సాధారణ స్థితిని తిరిగి స్థాపించే భాగంగా సెప్టెంబర్ 9 నుంచి న్యూయార్క్ నగరంలోని మాల్స్ మరియు రాష్ట్రవ్యాప్తంగా క్యాసినోలు తిరిగి తెరవడానికి ఆంక్షలతో కూడిన అనుమతి ఇస్తున్నట్లు గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో గురువారం 3 సెప్టెంబర్ న ప్రకటించారు.
క్యాసినోలు 25 శాతం సామర్థ్యంతో, 50 శాతం సామర్థ్యంతో మాల్స్ మరియు రెండింటిలో కోవిడ్ -19 వైరస్ కణాలను ఫిల్టర్ చేయగల ప్రత్యేకమైన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థల ఉంటేనే తిరిగి తెరవడానికి అనుమతించబడతాయి అని గవర్నర్ పేర్కొన్నారు. రెస్టారెంట్లలో మరియు క్యాసినోలులో సామాజిక దూరం మరియు సామర్థ్య నియమాలను సక్రమంగా అమలు చేయడానికి న్యూయార్క్ పోలీసు విభాగం పాల్గొనాలని మిస్టర్ క్యూమో సూచించారు. మార్చి మధ్యకాలం నుండి న్యూయార్క్ లో నిషేధించబడిన ఇండోర్ డైనింగ్ ని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించగా త్వరలోనే న్యూ యార్క్ సిటీ లో కూడా పునః ప్రారంభించటానికి ఆలోచిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.