యూఎస్ ఓపెన్ లో జకోవిచ్ బోణి

యూఎస్ ఓపెన్‍లో నోవాక్ జకోవిచ్ బోణికొట్టాడు. టైటిల్ ఫేవరేట్‍గా బరిలోకి దిగిన జకోవిచ్ తొలిరౌండ్‍ను సునాయాసంగా అధిగమించాడు. ఆర్థర్ ఆశే స్టేడియంలో జరిగిన తొలిరౌండ్‍లో జకోవిచ్ బోస్నియా అండ్ హర్జెగొవినా ఆటగాడు డామిర్ జుముర్‍పై 6-1, 6-4, 6-1 తేడాతో గెలుపొందాడు. జకోవిచ్ తన ప్రత్యర్థి డామిర్‍ను మ్యాచ్ మొదటి నుంచి కట్టడి చేశాడు. ఏ దశలోనూ డామిర్ పూచేయి సాధించకుండా దూకుడుతో ఆడాడు. ఈ ఏడాది ఓటమి అనేది లేకుండా దూసుకుపోతున్న జకోవిచ్ ఈ మ్యాచ్‍తో తన విజయాలను 24-0తో మెరుగు పరుచుకున్నాడు. బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ గ్రాండ్ స్లామ్‍కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. మెస్టర్న్ అండ్ సదరన్ ఓపెన్ విజేతగా జకోవిచ్ నిలిచిన సంగతి తెలిసిందే. కాగా జకోవిచ్ రెండో రౌండులో ఇంగ్లండుకు చెందిన కైల్ ఎడ్మండ్‍తో తలపడనున్నాడు.