న్యూయార్క్ లాక్ డౌన్ : గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో

న్యూయార్క్ నగరం మరియు న్యూయార్క్ నగర ఉత్తర శివారు ప్రాంతాలలో కోవిడ్-19 ప్రభావం అత్యధికంగా పెరగడంతో ఆ ప్రాంతాలలో ఆవశ్యకత లేని వ్యాపారాలు మరియు పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయలి అని కొత్త ఆంక్షలను గవర్నర్ ఆండ్రూ ఎం. క్యూమో మంగళవారం 6 అక్టోబర్ ప్రకటించారు.
గత వారం రోజుల్లో కొత్త కోవిడ్ -19 కేసుల సంఖ్య అధికం గా ఉన్న క్వీన్స్, బ్రూక్లిన్ మరియు న్యూయార్క్ నగర ఉత్తర శివారు ప్రాంతాలలో బుధవారం 7 అక్టోబర్ నుంచి శుక్రవారం 9 అక్టోబర్ లోపు చాలా దుకాణాలు, జిమ్‌లు, సెలూన్లు మరియు ఇతర వ్యాపారాలు తాత్కాళికంగా మూసివేయబడతాయి, కోవిడ్ -19 ప్రారంభంలో లాగా రెస్టారెంట్లు మరియు బార్‌లు మళ్లీ టేకౌట్ మరియు డెలివరీకి మాత్రమే పరిమితం చేయబడతాయి. ప్రార్థనా మందిరాలు 25 శాతం సామర్థ్యానికి పరిమితం చేస్తూ గరిష్టంగా 10 మంది వ్యక్తులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ప్రార్థనా మందిరాలు తప్ప సామూహిక సమావేశాలు నిషేధించబడతాయి.నగరంలోని హాట్ స్పాట్స్‌లోని పాఠశాలలను సోమవారం 5 అక్టోబర్ నుంచే మూసివేయబడ్డాయి అని రాక్‌ల్యాండ్ మరియు ఆరెంజ్ కౌంటీలలోని పాఠశాలలు కూడా మూసివేయబడతాయని గవర్నర్ ఆండ్రూ ప్రకటించారు.
కోవిడ్ -19 బాగా ఉన్న సమూహాలను మ్యాప్ చేయడానికి మరియు ప్రతి పరిమితులు ఎక్కడ వర్తిస్తాయో నిర్ణయించడానికి స్థానిక ప్రభుత్వాలతో రాష్ట్రం పనిచేస్తుందని మరియు కనీసం రెండు వారాల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయి మిస్టర్ క్యూమో ప్రకటించారు అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.