యూఎస్ ఓపెన్ కు మరో స్టార్ క్రీడాకారిణి దూరం

ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ టోర్నమెంటుకు మరో స్టార్ క్రీడాకారిణి దూరమైంది. ఈ నెల 31న న్యూయార్క్లో మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తాను ఆడటం లేదని 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 42వ ర్యాంకర్ జెలెనా ఒస్టాపెంకో ప్రకటించింది. తన వ్యక్తిగత షెడ్యూల్‍లో మార్పు కారణంగా తానీ నిర్ణయం తీసుకున్నానని 23 ఏళ్ల ఒస్టాపెంకో తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే యూఎస్ ఓపెన్ నంచి చాలా మంది వైదొలిగారు.