యూఎస్ ఓపెన్ నుంచి బోపన్న జోడీ ఔట్

యూఎస్ ఓపెన్ 2020 పురుషుల డబుల్స్ విభాగంలో ఇండో కెనడియన్ జోడి రోహన్ బోపన్న, డెనిస్ సాపోవాలోకు క్వార్టర్స్లో చుక్కెదురైంది. క్వార్టన్ ఫైనల్లో నెదర్లాండ్స్, రొమానియాకు చెందిన జోడీ జీన్ జూలియన్, హోరియా టెకావుతో తలపడిన బోపన్న జోడీ 5-7, 5-7తో ఓటమిపాలైంది. దీంతో యూఎస్ ఓపెన్‍లో భారత్ వెనుదిరిగింది. అంతకుముందు జరిగిన రెండోరౌండ్‍లో వీరిద్దరూ అరోసీడ్ కెవిన్ క్వావీ, ఆండ్రియా మైల్స్ను ఓడించారు. బోపన్న జోడీ ఓటమితో గ్రాండ్‍స్లామ్ భారత్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా పురుషుల సింగిల్స్లో రెండో రౌండ్‍లో భారత్‍కు చెందిన టాప్ సీడ్ సుమిత్ నగాల్ ఓటమిపాలయ్యారు. డొమినిక్ చేతిలో పరాజయం పొందిన సుమిత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.