న్యూయార్క్ లో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన రత్నాకర్

ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ డా. వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా భావిస్తూ.. ఆయన స్ఫూర్తి, అలోచనలతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జననేత, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి నాయకత్వాన పేద ప్రజలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అన్ని విధాలుగా అవిశ్రామంగా పనిచేస్తుందని అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ అన్నారు. వైఎస్సార్ 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొని వైఎస్‍ఆర్‍కు ఘన నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్ తండ్రిని మించిన తనయుడుగా యావత్ భారత దేశం కొనియాడుతోందన్నారు.