నేటి నుంచే యూఎస్ ఓపెన్

కరోనా మహమ్మరి దెబ్బకు ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే క్రీడలు గాడిలో పడుతున్నాయి. ఇంగ్లండ్ వేదికగా ఇప్పటికే క్రికెట్ సిరీస్‍లు విజయవంతంగా జరుగుతున్నాయి. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా పలు ఫార్ములావన్ రేసులను జయప్రదంగా నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా టెన్నిస్ క్రీడలకు కూడా తెరలేవనుంది. ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టెన్నిస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా బయటపడిన జరుగుతున్న తొలి గ్రాండ్‍స్లామ్ టోర్నీ ఇది మాత్రమే. దీంతో అందరి దృష్టి దీనిపైనే నిలిచింది. అయితే ఈ మెగా టోర్నీ అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియల్లో నిర్వహిస్తున్నారు.