ఈ విధానంలో దేశంలోనే నంబర్ వన్ గా తెలంగాణ :డిప్యూటీ సీఎం భట్టి
ఆన్ లైన్ ఆడిటింగ్ లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిటింగ్ విభాగం దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. వరుసగా మూడుసార్లు రాష్ట్రం ఈ ర్యాంకును సాధించిందని తెలిపారు. ఈ విధానాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన గుజరాత్ (Gujarat) ఆడిట్ శాఖ ఉన్నతాధికారుల బృందం సచివాలయంలో డిప్యూటీ సీఎంతో భేటీ అయింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆడిటింగ్ (Auditing) విభాగంతో పాటు అన్ని వ్యవస్థలు అత్యంతబలంగా ఉన్నాయని గుజరాత్ బృందానికి వివరించారు. కాగా రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలను (Village Panchayat) రెండు రోజులుగా సందర్శిస్తున్నామని,ఆన్ లైన్ ఆడిటింగ్ విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని గుజరాత్ బృందం తెలిపింది. తెలంగాణ ఆడిటింగ్ విధానం పారదర్శకంగా, సమర్థంగా కొనసాగుతోందని అభినందించింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








