ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన … షెడ్యూల్ ఇదే
తెలంగాణ గడ్డపై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 10వ తేదీన (ఆదివారం) ప్రధాని హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణ (Telangana)కు వస్తుండటం ఇదే తొలిసారి కావడంతో, రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సుమారు రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
షెడ్యూల్ …
మధ్యాహ్నం 1:10: బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణం.
మధ్యాహ్నం 2:20: బేగంపేట ఎయిర్పోర్టు కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2:30 – 3:00: బేగంపేట విమానాశ్రయ ప్రాంగణంలోనే అధికారిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
మధ్యాహ్నం 3:15: హెలికాప్టర్ లో హైటెక్ సిటీకి ప్రయాణం.
మధ్యాహ్నం 3:30 – 4:30: సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం, వైద్యులతో భేటీ.
సాయంత్రం 4:40: తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాయంత్రం 5:30 – 6:30: రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని, భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
రాత్రి 6:45: పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో గుజరాత్ లోని జామ్ నగర్ కు తిరుగు ప్రయాణం.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించాయి. పీఎం పర్యటన దృష్ట్యా నగరంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి








