వైసీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్
మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్ వో, వైసీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి (Pudi Srihari)ని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు (Bengaluru)కు వెళ్లి శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కుప్పం తీసుకొచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu) ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇటీవల శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఆదేశాలు ఇవ్వగా, హైకోర్టు వీటిని సస్పెండ్ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు (Supreme Court)లోనూ శ్రీహరికి ఊరట లభించలేదు. ఈ క్రమంలో ఆయన్ను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








