పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఫొటోల మార్ఫింగ్ కేసులో మాజీ సీఎం జగన్ (Jagan) కు సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరి (Pudi Srihari)కి సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు కు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం సైతం కల్పించలేమని చెప్పింది. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 15న తాడేపల్లిలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. గిరీశ్ కుమార్ రెడ్డి ని ని అనంతపురంలో అరెస్టు చేశారు. అయితే నిందితులకు రిమాండ్ విధించేందుకు కుప్పం మేజిస్ట్రేట్ నిరాకరించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కుప్పం పోలీసులు ఆ ఉత్తర్వులను హైకోర్టు (High Court) లో సవాల్ చేశారు. హైకోర్టు కుప్పం మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీనిపై శ్రీహరి, గిరీశ్ ఈ నెల 24న వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, అల్లంకి రమేశ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్థార్థ్ లూథ్రా హాజరయ్యారు. నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నోటీసుల జారీ నెపంతో పోలీసులు నిబంధనలు పక్కన పెట్టారన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రధాన వ్యాజ్యం ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో, తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఇవి కూడా చదవండి








