లెనిన్ క్లైమాక్స్ లో స్పెషల్ క్యామియో
అక్కినేని అఖిల్(Akhil Akkineni) నటిస్తున్న లెనిన్(Lenin) సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరి(Murali Kishore Abburi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లెనిన్ క్లైమాక్స్‌లో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచేలా ఒక స్పెషల్ గెస్ట్ అప్పియరెన్స్ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవుతుందని, అందుకే దానిని చిత్రబృందం పూర్తిగా గోప్యంగా ఉంచినట్లు సమాచారం.
ఇటీవల సినిమాను చూసిన నాగార్జున(Nagarjuna) కొన్ని కీలక సూచనలు చేసినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఎమోషన్ ను మరింత బలంగా చూపించేందుకు కొన్ని సీన్స్, డైలాగ్‌లను తిరిగి షూట్ చేసినట్టు తెలుస్తోంది. కథకు మరింత బలం చేకూరేలా ఈ మార్పులు చేసినట్లు సమాచారం. మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో అఖిల్ కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ఇద్దరి మధ్య ప్రేమకథ యూత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారని చెబుతున్నారు. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్ అంశాల సమతుల్యతపై డైరెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
లెనిన్ సినిమా అఖిల్ కెరీర్లో అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. గత సినిమాల ఫలితాల తర్వాత ఈసారి బలమైన కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించాలని చిత్రబృందం పూర్తి నమ్మకంతో ఉంది. సినిమా అవుట్‌పుట్‌పై నిర్మాతలు కూడా సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గెస్ట్ రోల్‌పై వస్తున్న ప్రచారం నిజమైతే రిలీజ్ టైమ్ లో అది అభిమానులకు అదనపు ఆకర్షణగా మారే అవకాశం ఉంది. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూలై 10న విడుదలయ్యే ఈ సినిమా అఖిల్‌కు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ బ్రేక్ అందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.








