రాజ్యసభకు ఉన్నట్లే మండలికి కూడా అధికారాలు : యనమల
అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లును శాసనమండలి పరిశీలించే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణ బిల్లును మండలిలో తాము అడ్డుకోలేదని, సెలక్ట్ కమిటికీ మాత్రమే పంపామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. రాజ్యసభకు ఉన్నట్లే రాష్ట్రాల్లో మండలికి కూడా అధికారాలు ఉంటాయన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లుపై మాట్లాడటం తప్పా అని నిదీశారు. సెలెక్ట్ కమిటీ నియామకంపై శాసన మండలి కార్యదర్శి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలుసుకునేందుకు ఒక బృందాన్ని పంపనున్నట్లు తెలిపారు.













