దివ్యాంగులకు చంద్రబాబు భరోసా
తనకు పుట్టుకతోనే రెండు చేతులు లేవని, చంద్రబాబు ప్రభుత్వం తనకు నెలకు రూ. 1500 పెన్షన్, ఐదు కేజీల బియ్యం ఇస్తుందని, అంతేకాకుండా నెలకు రూ. 10వేలు సాయం చేస్తున్నారని వెంకటలక్ష్మీ అనే మహిళ తెలిపింది. తనకే కాకుండా తనలాంటివాళ్లందరికి ఇదే మాదిరిగా నెలకు రూ. 10వేలు వస్తున్నాయని చెప్పింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ ఆమె పట్ల దేవుడు చిన్నచూపు చూశాడని, రెండు చేతులు లేవని అన్నారు. ఇలాంటి వాళ్లు ఏ పని చేయలేరని, వారికి మరొకరి సహాయం అవసరమని అన్నారు. ఇలాంటి వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో రెండు చేతులు లేని వారికి ఆర్థిక సాయం కింద నెలకు రూ. 10వేలు పింఛన్ కింద ఇస్తున్నామని అన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సానుభూతి తెలపడమే కాకుండా తోచిన విధంగా సాయం చేయాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు.













