TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన టీడీపీ ఎంపీలు

ఉపరాష్ట్రపతి ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16 మంది లోక్‌సభ(Lok Sabha), ఇద్దరు రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) , ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి (B. Sudarshan Reddy) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కిస్తారు. ఎన్నిక ఫలితం ఈ రాత్రికి వెలువడనుంది.