రాజ్యసభలో నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన వారు, తిరిగి ఎన్నికైన వారిలో 10మందితో రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ప్రమాణం చేయించారు. వారిలో టీడీపీ నుంచి సానా సతీష్‌బాబు (Sana Satish Babu), చింతకాయల విజయ్ (Chintakayala Vijay), భాష్యం రామకృష్ణ (Bhashyam Ramakrishna), జనసేన నుంచి లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh)ఉన్నారు. ప్రమాణస్వీకారం తర్వాత వారు చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నారు.








