రిపబ్లిక్ డే నాడు.. ఏపీ విషయంలో
ఆంధ్రప్రదేశ్ మాత్రం అరాచక ప్రదేశ్‌గా మారిందని బీజేపీ నేత సుజనా చౌదరి విమర్శించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జాతీయా జెండాను ఎగురువేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో జరిగిన సంఘటన రాజ్యాంగ వ్యతిరేకమని, అనుమతులు లేకుండా మసీదు కడుతుంటే అడ్డుకున్నందుకు డాక్టర శ్రీకాంత్ రెడ్డిని అరెస్టు చేశారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డిపై సెక్షన్ 307 ఎలా పెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి తెలిసి తెలీయకుండా మాట్లాడారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులూ వైసీపీ కార్యకర్తలా అన్నట్టు తయారయిందన్నారు. రిపబ్లిక్ డే నాడు ఏపీ విషయంలో బాధపడాల్సిన పరిస్థితి ఉందని అనడానికి బాధపడుతున్నాన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ సరిగా వినియోగించుకోలేకపోతోందన్నారు.
ప్రతీ సమస్యను పరిష్కరించడానికి అప్పట్లోనే ఆలోచించి ప్రజాస్వామ్య పరిష్కారాలిచ్చారని అన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య దేశం భారతదేశమని కొనియాడారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితులలో కరోనా కట్టడికి ప్రధాని మోదీ చేసిన ప్రణాళికలు ప్రపంచం మొచ్చుకుంటోందన్నారు. 160 కోట్ల వ్యాక్సినేషన్ భారత్‌లో చేశామన్నారు. బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నామని అన్నారు.













