తెలుగుదేశం పార్టీ కాపులకు సముచిత గౌరవం : సోము వీర్రాజు
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కాపులకు సముచిత గౌరవం ఇస్తూ రాజకీయంగా అవకాశాలు ఇస్తుంటే, వైసీపీ (YCP) మాత్రం కాపులను పావులుగా వాడుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan) పాలనలో కాపులకు ఏమేర న్యాయం జరిగిందో, ఎంత గౌరవం దక్కిందో అందరికి తెలుసని చురకలంటించారు. ప్రతి రాజకీయ అవసరానికి కాపులను వాడుకునే సంప్రదాయాన్ని మానుకోవాలని సూచించారు. వైసీపీ కాపు నేతలకు ఆ విషయం తెలిసినా తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.








