వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం : మంత్రి పెద్దిరెడ్డి
వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాప్తాడులో జరగబోయే వైసీపీ సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం పెదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభ అనంతరం వైసీపీ ఎన్నికల ఊపు అందుకుంటుందన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషి చేస్తున్నాం అన్నారు. రాబోయే ఎన్నికలకు పూర్తిగా వైసీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయని, ఈ సభతో రాష్ట్రంలో మూడు సిద్ధం సభలు పూర్తి అవుతాయని అన్నారు. త్వరలో పల్నాడులో మరో సభ ఉంటుందన్నారు. గత ఎన్నికల కంటే అత్యధిక స్థానాలు సాధించేందుకు ఈ సభ ఊతం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సభగా రాప్తాడు సిద్ధం సభ నిలుస్తుందన్నారు.













