వారిని చట్టపరంగా శిక్షిస్తాం : భాను ప్రకాశ్ రెడ్డి
వైసీపీ పాలనలో టీటీడీ (TTD)లో అనేక అక్రమాలు జరిగాయని తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. నిబంధనలను కూడా అప్పటి పాలకమండలి సడలించిందని, అప్పటి ఈవో Bhanu అనిల్ కుమార్ సింఘాల్ (Anil Kumar Singhal), ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి (Subbareddy) అందరూ పాపం చేశారని ఆక్షేపించారు. వారిపై పాలక మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వామివారి వద్ద అపచారం చేసిన అందర్నీ చట్టపరంగా శిక్షిస్తామని చెప్పారు.








