యువగళం పాదయాత్ర.. 3000 కి.మీ పైలాన్ ఆవిష్కరణ
యువగళం పాదయాత్ర 3,000 కి.మీ.కు చేరుకున్న సందర్భంగా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పైలాన్‌ను ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా యువగళం పాదయాత్ర 3,000 కి.మీ మైలురాయికి చేరింది. ఈ మజిలీకి గుర్తుగా తేటగుంట పంచాయతీలో పైలాన్‌ను ఆవిష్కరిస్తున్నా, వైసీపీ ప్రభుత్వం మూసివేసిన పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ తెరుస్తామని హామీ ఇస్తున్నా అని శిలాఫలకంపై లిఖించారు. అక్కడే పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేశ్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. తన వెంట నడుస్తున్న భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బావమరిది మోక్షజ్ఞ, తోడల్లుడు భరత్ పాల్గొన్నారరు. బ్రాహ్మణి 9.కి.మీ. దేనాన్ష్ 6 కి.మీ పొడవునా లోకేశ్‌తో కలిసి నడిచారు.








