మంత్రి లోకేశ్ కు ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నేటి నుంచి మూడు రోజులపాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో సాంకేతికత వినియోగం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం తదితర అంశాలపై మంత్రి లోకేశ్‌కు సింగపూర్ ప్రభుత్వం ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్‌ను అందజేయనుంది. ఈ మేరకు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ ఆహ్వానం పంపారు. మంత్రి పర్యటనలో రాజకీయాలు, ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, గృహ నిర్మాణం, పర్యాటకం, మీడియా వంటి రంగాల్లో వస్తున్న మార్పులు, ఆధునిక కాలంలో సమాజ అవసరాలు తదితర అంశాలపై సింగపూర్ మంత్రులు, నాయకులు, అధికారులతో చర్చిస్తారు.













