ఆర్-5 జోన్ పై పోరాటం ఆగదు : జడ శ్రావణ్
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వకుండా ఆ ప్రాంతంలో రాజధానేతర వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మీడయాతో మాట్లాడుతూ న్యాయ పోరాటం ఓ మార్గం మాత్రమేనని అక్కడి న్యాయం జరగకపోయినంత మాత్రాన ఉద్యమం ఆపకూడదని అమరావతి రైతులకు సూచించారు. అమరావతి రైతుల తరపున జై భీమ్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తుందన్నారు. ఆర్-5 జోన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలివ్వటాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులు త్యాగం చేసి ఇచ్చిన భూమిని వేరే వారికి ఎలా ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం జగన్ అమరావతిని విచ్చిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్`5 జోన్ అంశంలో అమరావతి రైతులకు నిరాశ మిలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు జగన్, ప్రేమ దృతరాష్ట్ర కౌగిలిలాంటిదని అభివర్ణించారు. నిజంగానే పేదలకు జగన్ సర్కార్‌కి ప్రేమ ఉందనుకుంటే అది పొరపాటేనని అన్నారు.













