YS Jagan: రాజకీయాలకు విజయసాయి గుడ్ బై … స్పందించిన జగన్
వైసీపీని వీడిన రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan) స్పందించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విశ్వాసం ముఖ్యమన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సహా పార్టీ నుంచి వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఇంకా ఒకరో అరో వెళ్లిపోయేవాళ్లుంటే వాళ్లకైనా అంతేనని వ్యాఖ్యానించారు. వైసీపీ (YCP) నేడు ఉందంటే అది నాయకుల వల్ల కాదని తెలిపారు. ఇటీవల విజయసాయిరెడ్డి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ (MP) పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్పందించారు.













