ఏపీలో విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు
కరోనా మహమ్మారిపై పోరాటానికి తమవంతుగా విరాళాలు ఇచ్చేవారికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చే దాతలకు 100 శాతం పన్ను మినహాయింపు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. 1961 నాటి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద పన్ను మినహాయింపు వర్తిస్తుందని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వి.ఉషారాణి తాను జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చెక్ ద్వారా విరాళాలు ఇవ్వాలనుకునేవారు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ఆంధప్రదేశ్ పేరుపై పంపాలని సూచించారు. బ్యాంకు ద్వారా నగదు రూపంలో విరాళాలు ఇవ్వాలనుకునేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్: 38588079208, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC కోడ్: SBIN001884, ఆంధ్రా బాంక్, అకౌంట్ నెంబర్: 110310100029039, వెలగపూడి, సెక్రటేరియట్ బ్రాంచ్, IFSC CODE: ANDB0003079













