గ్రామ స్వరాజ్యం దిశగా .. సంస్కరణలు అమలు : గవర్నర్ అబ్దుల్
భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఎగురవేశారు. ఈ సందర్బంగా సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు స్మరించుకున్నారు. ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, కుల, మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.













