Ghee: ఇది ఆ మహానుభావుల గొప్పతనం : అశోక్ గజపతిరాజు
పాలు లేకుండా నెయ్యి (Ghee) తయారు చేసే శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారని గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్టు చైర్మన్ అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) ఎద్దేవా చేశారు. విజయనగరం కోటలో మాన్సాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ లక్ష్మీపతిరాజు అధ్యక్షతన ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీ (TTD)కి కల్తీ నెయ్యి సరఫరా వెలుగుచూశాక , రసాయనాలతో నెయ్యి తయారవుతుందా అని ఇటీవల కొంతకాలంగా చర్చ జరుగుతోంది. చట్టాలు, మంచివారి చేతిలో పెడితే మంచి, చెడ్డవారి చేతిలో పెడితే చెడు జరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులను బడికి దూరం చేశారు. విద్యారంగం అభివృద్ధి కి ఏర్పాటైన మాన్సాస్ ట్రస్టునూ ఇబ్బంది పెట్టారు అని తెలిపారు. ట్రస్టును ఇబ్బందిపెట్టిన వ్యక్తి కూడా ఈ విద్యా సంస్థలో చదువుకున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)ను ఉద్దేశించి అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








