టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు : చంద్రబాబు
వైసీపీ పాలనలో అందరూ బాధితులేనని, అందులో తానూ ఉన్నానని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడారు. అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు వంటి నాయకులపై ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఐదేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని విమర్శించారు. టీడీపీ హయాంలో 2029 విజన్‌ను రూపొందించినట్లు తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రంగా ఏపీ ఉండేదన్నారు.
వైసీపీ హయాంలో పేదలు నిరుపేదలయ్యారు. ఆ పార్టీ నేతలు ధనవంతులయ్యారు. ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకున్న దొంగ ప్రభుత్వం ఇది. నమ్మి ఓటు వేసిన ప్రజల్ని జగన్ మోసం చేశారు. ఇప్పుడు మీ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిరచి బంగాళాఖాతంలో కలపాలి. టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు. కరెంట్ ఛార్జీలు సహా అన్నింటిపై ధరలు పెంచి, ఊరికో ప్యాలెస్ కట్టుకున్న జగన్, పేదల వ్యక్తి ఎలా అవుతారు? మా ప్రభుత్వం వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. యువతకు ఉపాధి కలిపిస్తాం. వర్క్‌ఫ్రమ్ హోం పని విధానానికి శ్రీకారం చుడుతా.ం అవసరమైతే వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేస్తాం. ఈ 45 రోజులు సైకిల్ ఎక్కి ప్రజల్లోకి వెళ్లి చైతన్యం కల్పించాలి.
జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామన్నారు. చెత్త పన్నును ఎత్తివేస్తాం. రైతులకు సబ్సిడీలు అందజేస్తాం. పెట్రోలు ధరలను నియంత్రిస్తాం. ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం. సుజల స్రవంతి ప్రాజెక్టు వస్తే ఉత్తరాంధ్రకు నీళ్ల సమస్య ఉండదు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. భస్మాసురుడిగాల ప్రజల నెత్తిన జగన్ చేయిపెట్టారు. ఓటుతో కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలని అని చంద్రబాబు పిలుపునిచ్చారు.













