మేఘా అధినేతకు సీఎం చంద్రబాబు అభినందనలు
మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ అధినేత సీవీ కృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సకాలంలో వేగవంతంగా పూర్తిచేసినందుకుగానూ ఆయనన్ను సభా ముఖంగా చంద్రబాబు అభినందించారు. రాత్రింబవళ్ళు కంపెనీ ఇంజనీర్లతో పనిచేయించి అనుకున్న సమయానికి ప్రాజెక్టు పనులు పూర్తిచేయించడంలో కృష్ణా రెడ్డి పాత్ర శ్లాఘనీయమని చంద్రబాబు కొనియాడారు. లక్షలాది మంది రైతులకు ఈ ఖరీప్‌లో సాగునీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మేఘా సంస్థ ప్రతినిధులు అంకిత భావం తోడవడంతోనే ఇది సాధ్యమైందన్నారు.













