జాషువా కళాప్రాంగణం కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో జాషువా కళాప్రాంగణం ఏర్పాటయింది. ఉండవల్లిలోని ప్రజావేదిక్ నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాషువా కళాప్రాంగణం కు శంకుస్థాపన చేశారు. ఈ కళాప్రాంగణం నిర్మాణానికి ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అవసత్రమైతే కళాప్రాంగణం నిర్మాణానికి ఎంత ఖర్చయినా కేటాయించ డానికి వెనకాడమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
జాషువా జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కళాప్రాంగణం నిర్మాణం రూపుదిద్దికుంటుంది .
జాషువా కళాప్రాంగణం నిర్మాణానికి గుంటూరులోని మహిళా కళాశాలలో భూమి కేటాయించామని త్వరితగతిన ఆ పనులు పూర్తయ్యేలా కలెక్టరును ఆదేశించామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
మహాకవి గుర్రంజాషువా కళాప్రాంగణం నిర్మాణంతో రాజధానిలో సాంస్కృతిక వైభవానికి నాందికానుందన్నారు. సమాజానికి చైతన్యపరచటానికి స్మారకచిహ్నం దోహదపడుతుందన్న ఆశాభావాన్ని సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు.













