Chandrababu: సీఎం చంద్రబాబును ఆహ్వానించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య (Surya Vikramaditya) వివాహానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. భట్టి విక్రమార్క వెంట మంత్రి శ్రీధర్ బాబు (Sridharbabu) ఉన్నారు. వీరిద్దర్ని చంద్రబాబు శాలువాతో సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అంతకుముందు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారుల్ని భట్టి విక్రమార్క కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుకు శుభలేఖ అందజేశారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ నాయకులతో కలిసి దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి








