త్వరలో పీఆర్సీ ప్రకటన .. ఏపీఎన్జీవో సంఘం
ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పీఆర్సీ ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు తెలియజేశారని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనవాసరావు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ను ఏపీ ఎన్జీవో నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పీఆర్సీ ఇస్తామని అన్నారు. తరువాత డీఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడిరచారు. సీసీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు లేకుండా అక్టోబరు 2న ప్రొబేషన్ ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.













