ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి : మంత్రి నిమ్మల
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి శ్రీరామరక్ష. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకుందాం రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పిలుపునిచ్చారు. కర్నూలులో ఆయన జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేల సమక్షంలో జల వనరులశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలతో గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. ఆ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి. మంత్రి లోకేశ్ (Minister Lokesh) నాయకత్వంలో మెగా డీఎస్సీ-2024 ఎంతో పారదర్శకంగా, పకడ్బందిగా నిర్వహిస్తే, యువతలో కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారానికి తెర తీశారు. రాయలసీమ (Rayalaseema)లో ప్రాధాన్య క్రమంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు, వలసలు శాశ్వతంగా నివారించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని పేర్కొన్నారు.








