అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి : పల్లా
హోం మంత్రి అనిత (Home Minister Anita)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) చేసిన వ్యాఖ్యలను ఆయన బేషరతుగా వెనక్కు తీసుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) డిమాండ్ చేశారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవం లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు. హోం మంత్రి అనితపై మాజీ మంత్రి అమర్నాథ్ అనుచిత వాఖ్యలు చేయడం దారుణం. తక్షణమే క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించాలి. అంతేతప్ప దుర్మార్గపు వాఖ్యలు, అసభ్య పదజాలం వాడితే వైసీపీ (YCP) నేతలకు పుట్టగతులుండవు అని అన్నారు.








