టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలుగుదేశం, జనసేన పార్టీ ల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తుండగా, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలో నిలబడ్డారు.













