పశ్చిమాసియా యుద్ధంలో గెలుపెవరిది..?
పశ్చిమాసియా యుద్ధం మొదలై 40 రోజులుగడుస్తోంది. ఇజ్రాయెల్ భుజంపై గన్ పెట్టి ఇరాన్ ను కొట్టేసే ప్లాన్ ను అమెరికా పక్కాగా అమలు చేసింది. ఈ దాడిలో ఇరాన్ అధినాయకత్వం అయాతుల్లా ఖొమైనీ హతులయ్యారు. ఆయన తర్వాత కీలక పోస్టుల్లో ఉన్న వారందరినీ ఇజ్రాయెల్.. అమెరికా సహకారంతో ఏరివేసింది. ప్రతిగా ఇరాన్.. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది .
అమెరికా గెలిచినట్లు ప్రకటించుకుంటోంది. తాము అనుకున్న లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గట్టిగా, ఘనంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ .. వాస్తవంగా ఏమి జరిగిందన్నది ప్రపంచానికి అంతటికీ కళ్లకు కట్టినట్లు చూపించింది ఇరాన్. దీంతో ట్రంప్.. మేం గెలిచాం.. మేం గెలిచాం అంటూ బాకా పట్టుకుని ఊదినా ప్రపంచం పట్టించుకోవడం లేదు.
ఇవి కూడా చదవండి
ఇరాన్… అయితే తాము గెలిచేశామంటూ విశ్వాసం వ్యక్తం చేసింది. నేరుగా అమెరికాను కొట్టలేకున్నా.. దాని మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలను ఓ ఆట ఆడించింది. దెబ్బకు.. అవన్నీ భయపడి ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని.. ఇరాన్ పై దాడులు నిలిపివేయాలంటూ ట్రంప్ పై ఒత్తిడి తెచ్చాయి. ఆఖరుకు పాకిస్తాన్, సిరియా , టర్కీ లాంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చింది. అయితే ఈ దేశాలంటే ఇజ్రాయెల్ కు మంట. దీంతో ఓవైపు ఇవి మధ్యవర్తిత్వం చేసి అంతా సెట్ రైట్ చేసేసరికి.. మళ్లీ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు ముమ్మరం చేసింది. దీంతో ఈ ఒప్పందం కాస్తా ఆటకెక్కినట్లే కనిపిస్తోంది.
యుద్ధంలో ఎంత కోల్పోయినా ఇరాన్ కు.. హర్మూజ్ జలసంధి దక్కింది. దీంతో ఆ సంధిపై నుంచి వెళ్లే షిప్పుల నుంచి కోట్లు వసూలు చేయడం ద్వారా తిరిగి తాను కోల్పోయిన డబ్బును.. ఆదేశం వసూలు చేసుకుంటోంది. దీనికి తోడు ఖర్గ్ ఐలాండ్ నుంచి వేల టన్నుల క్యూబిక్ మీటర్ల చమురును ఉత్పత్తి చేసి అమ్మడం చేసేందుకు ఇరాన్ కు.. అవకాశం ఉంది.దీంతో తిరిగి కార్యోన్ముఖురాలయ్యేందుకు ఇరాన్ గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అన్నింటికన్నా తీవ్రంగా నష్టపోయింది ప్రపంచదేశాలు. వాటికి సంబంధం లేని యుద్ధం కారణంగా.. వాటి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి. మళ్లీ మునుపటికి ఆర్థికవ్యవస్థల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి . ఇది ముస్లిం దేశాలను వేధిస్తున్న తీవ్రమైన ప్రశ్నగా చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి








