యుద్ధాన్ని ఆపిన ‘షాడో బ్రోకర్’.. కాల్పుల విరమణ వెనుక మాస్టర్ ప్లాన్..!
ప్రపంచం మొత్తం మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయిందని భయపడుతున్న తరుణంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) ఒక అసాధ్యమైన విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగియడానికి కొద్ది నిమిషాల ముందే.. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదరడం వెనుక వాన్స్ ఒక నిశ్శబ్ద దౌత్యవేత్తగా, ‘షాడో బ్రోకర్’గా కీలక పాత్ర పోషించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. జేడీ వాన్స్ మొదటి నుంచీ మధ్యప్రాచ్య (Middle East) దేశాల్లో అమెరికా ప్రత్యక్ష యుద్ధాలకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు.
ఇవి కూడా చదవండి
‘అమెరికా ఫస్ట్’ విధానంలో భాగంగా.. అనవసరమైన యుద్ధాల వల్ల అమెరికా సైనికుల ప్రాణాలు, ఖజానా వృధా కాకూడదనేది ఆయన గట్టి నమ్మకం. అందుకే, ట్రంప్ దూకుడుగా ఉన్న సమయంలో కూడా, వాన్స్ తెరవెనుక శాంతి మార్గాలను వెతకడం మొదలుపెట్టారు. మంగళవారం, బుధవారం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. వాన్స్ ఎంత చాకచక్యంగా వ్యవహరించారో అర్థమవుతుంది. నేరుగా ఇరాన్‌తో మాట్లాడకుండా, పాకిస్థాన్ అధికారులను మధ్యవర్తులుగా వాడుకుని టెహ్రాన్ పాలకులతో వాన్స్ రహస్య చర్చలు జరిపారు.
యుద్ధం వల్ల ఇరు దేశాలకు జరిగే భారీ నష్టాన్ని వివరిస్తూ, ఇరాన్ ముందు ఒక ఆచరణాత్మక ప్రతిపాదనను ఉంచారు. ఇరాన్ సమర్పించిన ఆ సంచలన 10 డిమాండ్ల (10-Point Proposal) వెనుక జేడీ వాన్స్ ఆలోచన ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా, అదే సమయంలో అమెరికా ప్రయోజనాలను కాపాడుతూ.. చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో ఆయన సఫలమయ్యారు. ట్రంప్ తన అల్టిమేటాన్ని పక్కన పెట్టి చర్చలకు సిద్ధమవ్వడం వెనుక వాన్స్ ఇచ్చిన భరోసానే ప్రధాన కారణం.
జేడీ వాన్స్ సాధించిన ఈ కాల్పుల విరమణ వల్ల ప్రస్తుతానికి పెను ముప్పు తప్పింది. రాబోయే శుక్రవారం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగే ఉన్నత స్థాయి చర్చలకు కూడా వాన్సే పర్యవేక్షకుడిగా ఉండే అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఇరాన్ ఆంక్షల రద్దు మరియు అమెరికా సైనిక ఉపసంహరణ వంటి కీలక అంశాలపై ఒప్పందం కుదిరితే.. అది వాన్స్ కెరీర్లోనే అతిపెద్ద దౌత్య విజయంగా నిలుస్తుంది. ట్రంప్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటే, వాన్స్ వాటిని తూకం వేస్తూ దౌత్యపరమైన పరిష్కారాలను చూపుతున్నారు. ఈ ‘గుడ్ కాప్ – బ్యాడ్ కాప్’ స్ట్రాటజీ వల్లే ఇరాన్ లొంగిరావడమే కాకుండా, అమెరికా యుద్ధం చేయకుండానే తన పంతం నెగ్గించుకోగలిగింది.
ఇవి కూడా చదవండి








