ఇండో జపాన్ – జపాన్ బిజినెస్ సమ్మిట్ విజయాలేంటి..?
జపాన్ తొలి మహిళా ప్రధాని తకైచీ భారత పర్యటన .. ఇరుదేశాల మధ్య సరికొత్త మైలురాయిగా మారింది.
ఢిల్లీలో జరిగిన 16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు ద్వారా ఇరుదేశాలు ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాలలో కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ యెన్ల (సుమారు $68 బిలియన్లు) ప్రైవేట్ రంగ పెట్టుబడులు తరలిరానున్నాయి.
తకైచీ తో పాటు వందమంది టాప్ క్లాస్ బిజినెస్ దిగ్గజాలు.. భారత్ లో పర్యటించారు. ఇరుదేశాల మధ్య దాదాపు 129 వ్యాపార ఒప్పందాలు (MoUs) కుదిరాయి, ఇవి ఉపాధి కల్పనకు మరియు వ్యాపార విస్తరణకు ఎంతో దోహదపడనున్నాయి. ఇక సరఫరా అంతరాయాలను తట్టుకునేందుకు ఒక కొత్త ఆర్థిక భద్రతా రోడ్‌మ్యాప్‌ను ఇరుదేశాల నేతలు ఆవిష్కరించారు.
సాంకేతిక మరియు ఇంధన రంగం (Energy & Tech)కీలక రంగాలు:
సెమికండక్టర్లు, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మరియు ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకున్నాయి.పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమోనియా ఉత్పత్తి కోసం దాదాపు $3 బిలియన్ల విలువైన క్లీన్ ఎనర్జీ ఒప్పందాలు జరిగాయి. దీని ద్వారా భారతదేశంలో తయారయ్యే గ్రీన్ ఇంధనాన్ని జపాన్‌కు ఎగుమతి చేస్తారు.
భారత దేశవ్యాప్తంగా 1,000 బయోగాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరుదేశాధినేతలు అంగీకరించారు. వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు (Crude Oil Reserves) మరియు సముద్ర ఇంధన రవాణాలో పరస్పర సహకారానికి ఇరుదేశాలు అంగీకరించాయి. రక్షణ రంగంలో మొదటిసారిగా ఇరుదేశాలు కలిసి సైనిక హార్డ్‌వేర్ ఉమ్మడి అభివృద్ధి (Military Hardware Co-development) ప్రాజెక్టును చేపట్టనున్నాయి.ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత: చైనా సైనిక ప్రాబల్యం మరియు సముద్ర సవాళ్లను ఎదుర్కొంటూ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడేందుకు ‘క్వాడ్’ (Quad) దేశాలైన భారత్, జపాన్ తమ రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
పర్యటనలో భాగంగా తకైచీ భారతీయ సంగీత వాయిద్యం ‘సంతూర్’ వాయించి ఇరుదేశాల సాంస్కృతిక బంధాన్ని చాటారు.మొత్తంగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత్, సనాయ్ తకైచీ నేతృత్వంలోని జపాన్ తమ “ప్రత్యేక వ్యూహాత్మక మరియు గ్లోబల్ పార్ట్నర్షిప్”ను ఈ పర్యటన ద్వారా తదుపరి స్థాయికి తీసుకెళ్లాయి.
తకాయిచి నా చిట్టి చెల్లెలు..
17 కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా సరఫరా వ్యవస్థను, సాంకేతిక సామర్థ్యాన్ని జపాన్ పెంచుకోనుందని తకాయిచి చెప్పారు. ఆమెను తన చిట్టి చెల్లెలుగా మోదీ అభివర్ణించారు.








