ఇరాన్ స్టీరింగ్ ఐఆర్ జీసీ చేతుల్లో..?
ఇరాన్-అమెరికా వార్ పుణ్యమాని ప్రపంచం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. రాజకీయ దురంధరుడు, ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమైనీ.. కొన్ని విషయాల్లో అతివాదిగా ఉన్నప్పటికీ.. క్రమంగా స్థిరమైన పంథా అవలంబించాడు. అయితే ఆయనను హత్య చేసి, ఇరాన్ లొంగిపోతుందని భావించింది అమెరికా. కానీ .. అమెరికా అనుకున్నది వేరు.. జరుగుతుంది వేరు.. ఇరాన్ స్టీరింగ్ కాస్తా… మిలటరీ పాలకులచేతుల్లోకి జారిపోియంది. దీంతో యుద్ధం కాస్త మరింత క్లిష్టంగా మారింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.దీంతో… ఈ సమయంలో దేశ నాయకత్వ బాధ్యతలు ఐఆర్ జీసీ (Islamic Revolutionary Guard Corps) లోని అతివాదుల చేతుల్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇరాన్ (Iran) సైన్యాన్ని, దౌత్యపరమైన నిర్ణయాలను వారే నియంత్రిస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహిద్, అతడి సన్నిహితులు కీలక పదవులను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో మితవాద నేతలు పాలన నుంచి పక్కకు జరిగారని రాసుకొచ్చింది. హర్మూజ్‌ను అమెరికా దిగ్బంధించిన నేపథ్యంలో వారాంతంలో ఈ మార్పు జరిగిందని తెలుస్తోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి మితవాదులను పక్కనపెట్టిన సూచనలు కనిపిస్తున్నాయని ఆ కథనం పేర్కొంది. శాంతిచర్చల వేళ హర్మూజ్‌ను తెరిచేందుకు అరాగ్చీ అంగీకరించారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎదుర్కోవడానికి హర్మూజ్‌ను మూసే ఉంచాలని ఐఆర్జీసీ భావిస్తోందని వాషింగ్టన్‌లోని ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు అహ్మద్ వహిద్‌కు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బఘెర్ నుంచి మద్దతు లభించిందని, అది ఆయన అధికారాన్ని సుస్థిరం చేసిందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి








