మే 4 నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. మే 3న సాయంత్రం అంకురార్పణం జరగనుంది. బ్రహ్మోత్సవాలకు ముందు ఏప్రిల్ 25వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. మే 4వ తేది ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7:30 గంటల నుండి 8:30 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.













