రాజ్యసభ సభ్యుడిగా పరిమళ్ నత్వానీ ప్రమాణం
రాజ్యసభ సభ్యుడిగా పరిమళ్ నత్వానీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తన ఛాంబర్లో నత్వానీతో ప్రమాణస్వీకారం చేయించారు. 2008లో ఝార్ఖండ్ నుంచి స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికైన నత్వానీ 2014లోనూ అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈసారి ఆంధప్రదేశ్ నుంచి వైకాపా తరపున ఎంపికైన విషయం విదితమే. కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్దీపక్ శర్మ, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పరిమళ్ నత్వానీ మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి పూర్తి చిత్తశుద్ధితో ఉన్నానన్నారు.













