విజయ్ కి లైన్ క్లియర్.. మద్దతు పలికిన వామపక్షాలు, వీసీకే
తమిళనాడు రాజకీయ సంక్షోభానికి శుక్రవారం తెరపడింది. రాజకీయ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ కి గణనీయమై మద్దతు లభించింది. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలు విజయ్ కి మద్దతు ప్రకటించాయి. దీని ఫలితంగా 108 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్… ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును సాధించింది.
ఇవ్వాళ సాయంత్రం 4:30 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. దిలా ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి TVK అధినేత విజయ్ శుక్రవారం సాయంత్రం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలవనున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వారంలో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థించనున్నారు. విజయ్ గవర్నర్ ని కలవడం ఇది మూడోసారి. ఈ సమయంలో తమకు పూర్తి మెజారిటీ లభించిందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం కల్పించాలని విజయ్ కోరనున్నారు.
ఇవి కూడా చదవండి








