Umbrellas: గొడుగుల దిగుమతిపై భారత్ ఆంక్షలు.. చైనాకు గట్టి షాక్!
దేశీయ పరిశ్రమలకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుండి, ముఖ్యంగా చైనా నుండి వెల్లువలా వస్తున్న చౌక రకం గొడుగుల (Umbrellas) దిగుమతికి కళ్లెం వేసింది. ఇకపై విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఒక్కో గొడుగు కనీస ధర (MIP) రూ. 100 ఉండాలని స్పష్టం చేసింది. రవాణా, బీమా ఖర్చులతో కలిపి రూ. 100 కంటే తక్కువ ధర ఉండే గొడుగులను భారత్లోకి అనుమతించబోమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
భారత్లోకి దిగుమతి అవుతున్న గొడుగుల్లో (Umbrellas) సింహభాగం చైనా నుండే వస్తున్నాయి. 2023 గణాంకాల ప్రకారం, మన దేశం సుమారు రూ. 140 కోట్ల విలువైన గొడుగులను దిగుమతి చేసుకోగా, అందులో 96 శాతం (సుమారు రూ. 130 కోట్లు) చైనా వాటాయే ఉంది. ఈ గొడుగుల సగటు ధర రూ. 72 నుండి రూ. 90 మధ్యలో ఉండటంతో, దేశీయ తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ చౌక దిగుమతులను అడ్డుకోవడమే కొత్త నిబంధన ప్రధాన ఉద్దేశం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అయితే ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZ), ఎగుమతి ఆధారిత యూనిట్లు (EOU), ముందస్తు అనుమతి (Advance Authorization) ఉన్నవారికి ఈ నిబంధన నుండి మినహాయింపునిచ్చారు. 2026-27 బడ్జెట్లో కూడా ప్రభుత్వం గొడుగులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతానికి లేదా ఒక్కో గొడుగుపై (Umbrellas) రూ. 60కి (ఏది ఎక్కువైతే అది) పెంచిన విషయం తెలిసిందే.






