Nitin Gadkari: ఏపీలో రూ. 573 కోట్లతో భారీ రహదారి.. ప్రకటించిన గడ్కరీ
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక వరం ప్రకటించింది. కృష్ణా జిల్లాలోని ప్రతిష్టాత్మక మచిలీపట్నం పోర్టుకు (Machilipatnam Port) అనుసంధానతను మెరుగుపరిచేందుకు రూ. 573.77 కోట్లతో 6-లేన్ల ఎక్స్టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వెల్లడించారు.
జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216 (కత్తిపూడి-ఒంగోలు) కూడలి నుండి మచిలీపట్నం బైపాస్ మీదుగా పోర్టు వరకు ఈ 6-లేన్ల రహదారిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు, ఒక రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB) నిర్మిస్తామని గడ్కరీ (Nitin Gadkari) ప్రకటించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దీనివల్ల జాతీయ రహదారుల నుండి నేరుగా పోర్టుకు కనెక్టివిటీ ఏర్పడి, సరుకు రవాణా వేగవంతమవుతుంది. అలాగే మచిలీపట్నం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరుగుతుందని గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు.






