T20 World Cup: మా నష్టాన్ని మీరే భరించాలి.. పాక్ బోర్డుకు శ్రీలంక లేఖ!
టీ20 ప్రపంచకప్లో (T20 World Cup) భాగంగా భారత్తో జరగాల్సిన మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించడంపై శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ రద్దు కావడం వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని, ఆ నష్టాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎల్సీ ఘాటు లేఖ రాసింది.
పాక్ ప్రభుత్వ (T20 World Cup) నిర్ణయం వల్ల ఇప్పటికే కొలంబోలోని హోటళ్లలో భారీగా బుకింగ్స్ రద్దయ్యాయని, ఇది శ్రీలంక పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. మ్యాచ్ నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, చివరి నిమిషంలో ఈ నిర్ణయం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని పేర్కొంది. గతంలో పాకిస్థాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు తాము అండగా నిలిచామని గుర్తుచేస్తూ, నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మరోవైపు పాక్ మాజీ క్రికెటర్లు మాత్రం శ్రీలంక లేఖను పీసీబీ పట్టించుకోకపోవచ్చని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఐసీసీ పరిధిలో ఉందని, ప్రభుత్వం ఆదేశించినందున పీసీబీ చేసేదేమీ లేదని వాదిస్తున్నారు. తమకు (T20 World Cup) వాటిల్లిన నష్టంలో పీసీబీ వాటా పంచుకోవాలని, లేదంటే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్తామని శ్రీలంక బోర్డు హెచ్చరిస్తోంది.






