INDvsPAK: కొలంబోకు వెళ్తున్నాం.. ఆడకపోతే రెస్ట్ తీసుకుంటాం: సూర్యకుమార్ యాదవ్
పాకిస్థాన్ జట్టు భారత్‌తో (INDvsPAK) ఆడబోమంటూ చేసిన ప్రకటనపై భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) స్పందించాడు. పాకిస్థాన్ మ్యాచ్ బహిష్కరించినప్పటికీ, భారత జట్టు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొలంబో (Colombo) వెళ్తుందని స్పష్టం చేశాడు. ముంబైలో జరిగిన ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “మా స్టాన్స్ చాలా క్లియర్.. మేం ఆడబోమని చెప్పలేదు, వారే చెప్పారు. మా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి, మేం కచ్చితంగా కొలంబో వెళ్తున్నాం” అని తేల్చి చెప్పాడు.
పాక్‌తో మ్యాచ్ (INDvsPAK) షెడ్యూల్ ప్రకారమే ప్రయాణిస్తామని సూర్య వెల్లడించాడు. ఫిబ్రవరి 7న టీ20 వరల్డ్‌లో తొలి మ్యాచ్ ఆడిన తర్వాత, ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం కొలంబో వెళ్తామని సూర్య తేల్చిచెప్పాడు. “ఐసీసీ (ICC) షెడ్యూల్ ఇచ్చింది. న్యూట్రల్ వేదికలో మ్యాచ్ జరపాలని నిర్ణయించారు. మేం ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అవతలి వైపు నుంచే అభ్యంతరం వచ్చింది” అని అన్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పాక్ (INDvsPAK) నిర్ణయంపై తాను ఏం చేయలేనని, అది ఆ దేశ ప్రభుత్వ పరిధిలోని అంశమని సూర్య చెప్పాడు. బంగ్లాదేశ్ పట్ల సంఘీభావంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, సూర్యకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.






