PM Modi: సిక్కులంటే కాంగ్రెస్కు ఎందుకంత ద్వేషం? ప్రధాని మోదీ ధ్వజం
సిక్కు సోదరుల త్యాగాలను విస్మరించి, వారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం విషం చిమ్ముతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రక్షణలో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో సిక్కుల పాత్ర అనిర్వచనీయమని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం వారి మనోభావాలను దెబ్బతీసేలా, వారిని అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్సభ బయట కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన చేస్తున్నప్పుడు అటుగా వెళ్లిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టును రాహుల్ అవమానించారు. బిట్టు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. బుధవారం నాడు లోక్సభ వద్ద నిరసన చేస్తున్న రాహుల్ గాంధీ.. బిట్టును చూడగానే వెటకారమాడారు. ‘నా ద్రోహి మిత్రుడొచ్చారు. ఏం ద్రోహి? నువ్వు మళ్లీ మా పార్టీలోకి వచ్చి తీరతావ్’ అన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తనను ద్రోహి అనడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన బిట్టు.. ‘మీరు దేశానికి ద్రోహం చేశారు’ అంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా స్పందించిన ప్రధాని మోడీ.. బిట్టును ‘ద్రోహి’ అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘మనలో ఒకరిని ద్రోహి అని ఎలా అంటారు? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశం కోసం త్యాగాలు చేసిన వారి కుటుంబీకులను ఇలా అవమానిస్తారా? ఇది రాహుల్ అహంకారానికి నిదర్శనం’ అంటూ మోడీ మండిపడ్డారు.






