WPL 2026: ఆర్సీబీకి రెండో ట్రోఫీ.. మంధాన సూపర్ ఇన్నింగ్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026) 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (DC)పై ఘన విజయం సాధించి, రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. వడోదర వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
టాస్ (WPL 2026) ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (57), లారా వోల్వార్ట్ (44) రాణించారు. అనంతరం 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇది డబ్ల్యూపీఎల్ (WPL) చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేదన (Highest Run Chase) కావడం విశేషం.
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) ఫైనల్లో విశ్వరూపం చూపించింది. కేవలం 41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమెకు జార్జియా వోల్ (79 పరుగులు) చక్కటి సహకారం అందించింది. వీరిద్దరూ రెండో వికెట్కు ఏకంగా 165 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి (WPL 2026) మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన స్మృతి మంధాన.. మొత్తం 377 పరుగులతో టోర్నీలో (WPL 2026) అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచి ‘ఆరెంజ్ క్యాప్’ను సొంతం చేసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను నిరాశపరిచింది.






