హోంశాఖ తనవద్దే.. మంత్రులకు శాఖల కేటాయింపు
తమిళనాడులో విజయ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అలాగే మంత్రులకు తాజాగా శాఖలను కూడా కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను సీఎం విజయ్ తన దగ్గరే వుంచుకున్నారు. అలాగే ప్రజా, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవిన్యూ, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా శాఖలను తన వద్దే వుంచుకున్నారు.
ఇక.. సీనియర్ నాయకుడైన సెంగొట్టయ్యన్ కి కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. దీంతో ఆయనకు విజయ్ ఎంతగా ప్రాధాన్యమిచ్చారో తెలిసిపోతుంది. ఇక.. కేబినెట్ లో అత్యంత పిన్న వయస్కురాలైన కీర్తనకు పరిశ్రమల శాఖ ఇచ్చారు. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక విభాగాన్ని కూడా కేటాయించారు.
అలాగే ఎన్.ఆనంద్ కి గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖను కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, పేదరిక నిర్మూలన కార్యక్రమం, చిన్న నీటిపారుదలతో పాటు సాగునీటి ప్రాజెక్టులను కేటాయించారు.
ఇక.. అదవ్ అర్జునకు పబ్లిక్ వర్క్స్, క్రీడలు,రహదారులు, భవనాలు, చిన్న ఓడరేవుల అభివృద్ధిని కేటాయించారు.
డాక్టర్ కేజీ అరణ్ రాజ్ కి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం శాఖల్ని కేటాయించారు.అలాగే పి. వెంకట రమణన్ కి ఆహార, పౌర సరఫరాలను కేటాయించారు. నిర్మల్ కుమార్ కి ఇంధన వనరులు, విద్యుత్, న్యాయశాఖ, జైళ్లు, అవినీతి నివారణ వంటి శాఖలను కేటాయించారు. అలాగే రాజ్ మోహన్ కి పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార, ప్రచార శాఖలను కేటాయించారు.
అయితే.. సీఎం విజయ్ మాత్రం మహిళల సంక్షేమం, యువత, హోంశాఖను తన వద్దే వుంచుకున్నారు. విజయ్ అధికారంలోకి రావడంలో యువత, మహిళలే కీలక పాత్ర పోషించారు. దీంతో అత్యంత జాగ్రత్తగా తానే చూసుకోవడానికి జాగ్రత్తపడుతున్నారు.
ఇక.. టీవీకే అధికారంలోకి రావడంలో, క్షేత్ర స్థాయిలో వనరుల సమీకరణ, పార్టీ ప్రచారాలు, టిక్కెట్ల వ్యవహారంలో అత్యంత కీలకంగా వుంటూ, విజయ్ కి అన్ని రకాలుగా వ్యవహరించిన సెంగొట్టియ్యన్ కి కూడా పెద్ద పీట వేశారు. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు.







